: భూమా అఖిలప్రియపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల అరెస్ట్!


భూమా నాగిరెడ్డి కుమార్తె, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే, నిన్న వెలగపూడిలోని సచివాలయానికి అఖిలప్రియ వెళుతున్న సమయంలో, మందడం వద్ద ఆమె కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కారు డోర్లను కొట్టారు. దీంతో అప్రమత్తమైన ఆమె గన్ మెన్... కాల్పులు జరుపుతానని హెచ్చరించాడు. దీంతో, వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో అఖిలప్రియపై దాడి అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే, గుంటూరు రూరల్ ఎస్పీ నాయక్ ఘటనా స్థలికి వెళ్లారు. దాడికి సంబంధించి ఆరా తీశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు... నిందితులను  గుర్తించి, అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంతంలో భయానక పరిస్థితులను కల్పించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News