: మెగాస్టార్ చిరంజీవితో తమ్ముడు పవన్ కల్యాణ్ భేటీ.. ఏం చర్చించారో సస్పెన్స్!
మెగాస్టార్ చిరంజీవితో తమ్ముడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. చిరంజీవి నటించిన ఖైదీ నంబరు 150 సినిమా ప్రి రిలీజ్ వేడుకకు హాజరు కాలేకపోయిన పవన్ గురువారం అన్నయ్య ఇంటికి వెళ్లి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీరు ఏం మాట్లాడుకున్నారనే విషయం సస్పెన్స్‌గా మారింది. చాలా రోజుల తర్వాత కలుసుకున్న అన్నాతమ్ముళ్లు సినిమాల గురించి మాట్లాడుకున్నారా? లేక తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారా? అనే విషయం తెలియరాలేదు.