: యూఎస్ మీడియాకు దిమ్మదిరిగే సమాధానమిచ్చిన ప్రియాంకా చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యూఎస్ లో మీడియాకు దిమ్మదిరిగే సమాధానమిచ్చి ఆకట్టుకుంది. లాస్ ఏంజిలెస్ లో జరిగిన కార్యక్రమంలో పీపుల్స్ చాయిస్ అవార్డు అందుకొని వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధి ప్రియాంకా చోప్రాను... 'అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమైనా భయపడుతున్నారా?' అంటూ ప్రశ్నించారు. దానికి ఏమాత్రం తడుముకోని ప్రియాంకా.. 'నేను భారతీయురాలిని.. దేనికీ భయపడను.. ఏం నీకు భయంగా ఉందా?' అని ఎదురు ప్రశ్నించింది. దీంతో అవాక్కయిన ఆ ప్రతినిధి అక్కడి నుంచి తప్పుకున్నాడు. దీంతో అందాల సుందరి కిరీటం గెలుచుకున్న ప్రియాంకతో వ్యవహారం ఆషామాషీ కాదని అనుకుంటున్నారు.