: నారాయణమూర్తి సినిమాను చూసేందుకు ప్రత్యేక సెలవు ప్రకటించిన ఆదిలాబాద్ ఎస్పీ!
సహజ నటి జయసుధ, ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి జంటగా నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో, ఆదిలాబాద్ జిల్లాలోని 230 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఈ చిత్రాన్ని చూసే అవకాశం కల్పిస్తూ ఎస్పీ శ్రీనివాస్ ప్రత్యేక సెలవు ప్రకటించారు. హెడ్ కానిస్టేబుళ్లందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఈ చిత్రం చూడాలని వారికి ఆయన సూచించారు. ఈ సినిమాను ఈరోజు సాయంత్రం ఎస్పీ కూడా చూడనున్నట్లు సమాచారం.