: దూకుడు చూపిస్తున్న యువీ...ఆచితూచి ఆడుతున్న ధోనీ
కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తడబడి నిలబడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు వోక్స్ షాకిచ్చాడు. ఐదు ఓవర్లు బౌలింగ్ చేయగా, అందులో మూడు మెయిడెన్ ఓవర్లు వేసి, మూడు వికెట్లు తీశాడు. దీంతో క్రీజులోకి దిగిన యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలు జట్టును ఆదుకునే ప్రయత్నంలో పడ్డారు. యువరాజ్ సింగ్ సహజశైలిలో దూకుడు చూపిస్తుండగా, ధోనీ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. ఈ క్రమంలో యువీ 31 బంతుల్లో 28 పరుగులు చేయగా, ధోనీ 22 బంతుల్లో 6 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 13 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.