: 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా
కటక్ వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తడబడుతోంది. ఇంగ్లండ్ బౌలర్ వోక్స్ విసురుతున్న బంతులకు టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రాహుల్ 5, విరాట్ కోహ్లీ 8 పరుగులకే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అనంతరం శిఖర్ ధావన్ కూడా వోక్స్ బౌలింగ్‌లో 11 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చాడు. ధోనీతో పాటు క్రీజులో యువరాజ్ సింగ్ ఉన్నాడు. టీమిండియా స్కోరు 25/3 గా ఉంది.