: బ్రెస్ట్ కేన్సర్ వస్తే సిగ్గుపడకండి.. సైనికుల్లా పోరాడండి: నటి గౌతమి
బ్రెస్ట్ కేన్సర్ వ్యాధి వస్తే సిగ్గుపడకూడదని... దానిపై సైనికుల్లా పోరాడాలని ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. ఆ మహమ్మారిని జయించవచ్చు అనే దానికి తానే గొప్ప ఉదాహరణ అని చెప్పారు. నిన్న సాయంత్రం ఖమ్మం ఐఎంఏ హాల్ లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు 'లైఫ్ ఎగైన్ ఫౌండేషన్' ఛైర్ పర్సన్ గౌతమి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తనకు బ్రెస్ట్ కేన్సర్ సోకిందని... తనకు వ్యాధి సోకిన లక్షణాలను తానే గుర్తించానని చెప్పారు. తనకు కేన్సర్ సోకిందని తెలిసినప్పటికీ కుంగిపోలేదని.. ఎంతో నిబ్బరంతో ఆ మహమ్మారిని జయించానని తెలిపారు.