: వచ్చేస్తోంది అత్యంత చవక అయిన 'జియో' ఫీచర్ ఫోన్... ఫొటో చూడండి!


ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధాంతం ఒక్కటే. తనకు పోటీ ఉండకూడదు... ప్రత్యర్థులంతా మట్టి కరవాల్సిందే... ఇదే రిలయన్స్ సిద్ధాంతం. టెలికాం రంగంలోకి జియోతో అడుగుపెట్టిన వెంటనే ప్రత్యర్థులందరినీ బెంబేలెత్తించింది జియో. జియో దెబ్బకు ఇప్పటి దాకా తమకు లాభాల పంట పండిస్తున్న ప్లాన్లన్నింటినీ మార్చుకోవాల్సిన పరిస్థితి ఇతర కంపెనీలదంటే రిలయన్స్ దెబ్బ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా తన సొంత ఫీచర్ ఫోన్ ద్వారా వోల్టీ సర్వీస్ అందించేందుకు జియో సిద్ధమైంది. దీంతో తమ అమ్మకాలు అమాంతం పడిపోయే ప్రమాదం ఉందని ఫోన్ల తయారీ కంపెనీలు డీలాపడిపోతున్నాయి.

రిలయన్స్ జియో విడుదల చేస్తున్న ఫీచర్ ఫోన్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో అనధికారికంగా బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఇవే. కీబోర్డుతో ఈ ఫోన్ వస్తోంది. ఇందులో మైజియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ ల కోసం ప్రత్యేక బటన్స్ ఉన్నాయి. దీని విలువ దాదాపు రూ. 1500 ఉంటుంది. 

  • Loading...

More Telugu News