: వంగవీటి రంగాకు టీడీపీ ఎమ్మెల్యే తనయుడి నివాళి!
దివంగత వంగవీటి మోహన రంగాకు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ కుమారుడు రవితేజ ఘన నివాళి అర్పించారు. విజయవాడలోని పైపులరోడ్డులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు పైపుల రోడ్డుకు రవతేజ వచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం, ఆ ప్రాంతంలో ఇటీవల ధ్వంసమైన రంగా విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడున్న ఫొటోకు దండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.