: మాటమార్చిన శశికళ భర్త నటరాజన్.. మోదీ చాలా మంచి వ్యక్తంటూ కితాబు
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ మాట మార్చారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించి రెండు రోజులైనా గడవకముందే మోదీ చాలామంచి వ్యక్తి అంటూ కితాబిచ్చారు. ఆయనకు ప్రజల కష్టసుఖాల గురించి బాగా తెలుసన్నారు. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని ప్రశంసించారు. ఏదైనా కేసులో తనను ఇరికించి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసినా మోదీ వర్ధిల్లాలి అంటూ సంతోషంగా జైలుకెళ్తానని పేర్కొన్నారు.
జయలలిత మేనకోడలు దీప, ఆమె సోదరుడు దీపక్‌లు కూడా తమ పిల్లలేనని, దీపను అదృశ్య శక్తులేవో వెనకుండి నడిపిస్తున్నాయని అన్నారు. వారి భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందన్నారు. జల్లికట్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్న నటరాజన్ జల్లికట్టు కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.