: నా వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షంతవ్యుడిని: ప్రవచన కర్త చాగంటి
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తమ కులాన్ని అవమానించారంటూ తెలుగు రాష్ట్రాల్లోని యాదవ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాగంటి స్పందించారు. తన ప్రవచనంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని, ఎవరిపైనా తనకు ద్వేష భావన లేదని అన్నారు.
‘యాదవుల భాగ్యాన్ని, వారి అమాయకత్వాన్ని వర్ణించేటప్పుడు తెలుగు భాషలో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మాటను నేను అన్నాను. కానీ, ఆ మాట వెనుక ఉద్దేశం పరమ పవిత్రం. వాళ్లను విమర్శించడం, తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ, నేను అలా అన్నప్పుడు ఎవరైనా ఆ మాటల వలన బాధ పొంది ఉంటే దానికి నేను క్షంతవ్యుడిని. మనసులో అన్యభావన పెట్టుకోవద్దని కోరుతున్నాను’ అని చాగంటి అన్నారు.