: రాంగోపాల్ వర్మ యూ టర్న్...చిరంజీవి 'ఖైదీ నంబర్ 150'పై పొగడ్త!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ యూటర్న్ తీసుకున్నాడు. విడుదలకు ముందు బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని పొగిడి, చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమాను విమర్శించిన రాంగోపాల్ వర్మ చిరంజీవి నటించిన సినిమాను చూసిన తరువాత దానిని కీర్తిస్తూ ట్వీట్ చేశాడు. ఖైదీ సినిమా ఫెంటాస్టిక్ అన్నాడు. చిరంజీవి ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయని వర్మ అభిప్రాయపడ్డాడు. సినిమాల నుంచి విరామం తీసుకున్న తొమ్మిదేళ్లకు ముందు చిరంజీవి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే తెరపై కనిపించారని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమాను ఇప్పుడే చూశానని, చిరంజీవికి 150 మిలియన్ చీర్స్ అంటూ విసెష్ తెలిపాడు. కాగా, గతంలో వర్మ విమర్శించడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.