: చిరంజీవికి ‘కంగ్రాట్స్’ చెప్పిన సుహాసిని!
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో నటిస్తున్నారనే ప్రకటన వెలువడిన నాటి నుంచి, ఆ చిత్రం విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న నేటి వరకు ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా, చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటించడంతో అభిమానులకే కాదు, సినిమా ఇండస్ట్రీలోని నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా తమ ఆనందం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ట్వీట్లు చేశారు. చిరంజీవి సరసన గతంలో ఎన్నో చిత్రాల్లో నటించిన నటి సుహాసిని తాజాగా ఒక ట్వీట్ చేశారు. ‘నా మిత్రుడు, కొలీగ్ కు శుభాకాంక్షలు. సంతోషంతో పాటు గర్వంగా కూడా ఉంది..’ అంటూ ఆ ట్వీట్ లో సుహాసిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవితో కలిసి ఉన్న ఒక ఫోటోను సుహాసిని పోస్ట్ చేశారు.