: అప్పట్లో ఉత్తమ నటుడు అవార్డును డబ్బు లిచ్చి కొనుక్కున్నా: రిషికపూర్


బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ తన అభిమానులు, ప్రేక్షకులు కంగు తినే ఒక విషయాన్ని బయటపెట్టారు. 1973లో ‘బాబీ’ సినిమాతో హీరోగా పరిచయమైన రిషి కపూర్, ఆ చిత్రానికి 1974లో ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డును పొందారు. ఆ ఫిలిం ఫేర్ అవార్డు తనకు ఎలా దక్కిందనే విషయం గురించి ఆయన తాజాగా ప్రస్తావించారు.

రూ.30 వేలు పెట్టి ఈ అవార్డును తాను కొనుక్కున్నానని చెప్పారు. ఆ తర్వాత, ఈ పని చేసినందుకు తాను చాలా సిగ్గుపడ్డానని, మరెప్పుడూ ఇటువంటి పని చేయలేదని అన్నారు. రిషికపూర్ ఆత్మకథతో కూడిన ‘ఖుల్లం ఖుల్లా’ పుస్తకాన్ని ఇటీవల ప్రచురించారు. ఈ నేపథ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రిషికపూర్ బయటపెట్టారు. కాగా, రిషికపూర్ చేసిన ఈ ప్రకటనపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.  

  • Loading...

More Telugu News