: ప్రభుత్వానికున్న ఇబ్బందులేంటో తెలియదు...మంత్రులతో మాట్లాడుతాను: పోలవరం రైతులతో పవన్ కల్యాణ్


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు నిర్మాణంలో ప్రభుత్వానికున్న ఇబ్బందులేంటో తనకు తెలియదని పవన్ కల్యాణ్ తెలిపారు. రైతులకు సంబంధించిన 203 ఎకరాల భూముల సేకరణ విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటో తనకు తెలియదని అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణల్లో కనిపించే సమస్యలతోపాటు కనిపించని సమస్యలు కూడా ఉంటాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి సందర్భాల్లోనే సామాజిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి సందర్భాల్లోనే కుల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని, అలాంటి పరిస్థితి ఎదుర్కొనకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News