: ఈ రంగంలో నిలబడాలంటే కేవలం నటన వస్తేనే సరిపోదు: సోనూ సూద్


సినిమా రంగంలో రాణించాలంటే కేవలం నటించడం మాత్రమే వస్తే సరిపోదని, మిగిలిన నటుల కంటే భిన్నంగా, మనదైన ప్రత్యేకతను చాటుకుంటే తప్పా ఈ రంగంలో నిలబడలేమని బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ అభిప్రాయపడ్డారు. త్వరలో విడుదల కానున్న ‘కుంగ్ ఫూ యోగా’ సినిమాలో అంతర్జాతీయ నటుడు జాకీ చాన్ తో కలిసి సోనూ సూద్ నటించారు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో విలేకరులతో సోనూసూద్ మాట్లాడుతూ, తాను మోడలింగ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. అయితే, తన తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో ఆ ఇబ్బందులను అధిగమించగలిగానని అన్నారు.  ‘కుంగ్ ఫూ యోగా’ చిత్రం ఈ నెల 28న చైనాలో, ఫిబ్రవరి 3న భారత్ లో విడుదల కానుందని, ఈ రెండు దేశాల్లో ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని సోనూ సూద్ అన్నారు.

  • Loading...

More Telugu News