: అమ్మాయిలని కూడా చూడకుండా కర్రతో బాదేసిన యజమాని!
ఆడ పిల్లలని కూడా చూడకుండా ఇంటి యజమాని వారిని కర్రతో బాదిన దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలు బెంగళూరులో ఒక ఇంట్లో అద్దెకు వుంటున్నారు. పార్కింగ్ విషయమై ఈ అమ్మాయిలకు, యజమానికి మధ్య చిన్న గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో, రెచ్చిపోయిన ఇంటి యజమాని, ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలను కర్రతో బాదిపారేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గడచిన డిసెంబర్ చివరి వారంలో జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది.