: హ్యాపీ బర్త్ డే, మిషెల్... ఐ లవ్ యు: బరాక్ ఒబామా
ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ (ఫ్లోటస్) మిషెల్ ఒబామా తన 53వ పుట్టినరోజును ఇటీవల జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా తన భార్యకు శుభాకాంక్షలు చెబుతూ, ఒక ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒబామా, మిషెల్ కలిసి గోల్ప్ కార్టులో ప్రయాణిస్తున్న ఈ పాత ఫొటో ఆకట్టుకుంటోంది. అమెరికాలోని దక్షిణాది ప్రాంతమైన చికాగోలో పుట్టి పెరిగిన మిషెల్, తన పాత్రను అద్భుతంగా నిర్వహించినందుకు కృతఙ్ఞతలతో పాటు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నట్లు పేర్కొన్న ఒబామా, ‘హ్యాపీ బర్త్ డే, మిషెల్... ఐ లవ్ యూ’ అని తన ట్వీట్ లో తెలిపారు. కాగా, యూఎస్ అధ్యక్షుడు ఒబామా, ఫ్లోటస్ మిషెల్ లు గత వారం తమ చివరి ప్రసంగాలను ఎంతో భావోద్వేగభరితంగా చేశారు.