: కాలేజీ నడుపుతూ, ప్రొఫెసర్ తో ప్రేమాయణం, ఆపై మోసం... కడపలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్


విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ను ప్రేమ పేరిట మోసం చేసినందుకు మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు చంద్ర ఓబుల్ రెడ్డిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, శివానందరెడ్డి కుటుంబం 'శివానందరెడ్డి కాలేజీ'ని నిర్వహిస్తోంది. ఇదే కాలేజీలో వాసంతి రెడ్డి అనే యువతి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది. ఆమెను చంద్ర ఓబుల్ రెడ్డి ప్రేమిస్తున్నానని చెబుతూ వెంటపడ్డాడు. ఆపై మోసం చేశాడు. జరిగిన విషయాన్ని మూడు రోజుల క్రితం వాసంతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో చంద్ర ఓబుల్ రెడ్డిని నేడు అరెస్ట్ చేశారు. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఓబుల్ రెడ్డిని కోర్టులో హాజరు పరిచారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు ఆయన్ను కస్టడీకి కోరనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News