: ఎన్నికల బరిలోకి దిగుతా: నారా లోకేష్


పార్టీ ఆదేశిస్తే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కేబినెట్ లో చోటు గురించి వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను ఆచరిస్తానని తెలిపారు.

తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం దక్కడానికి ఎన్టీఆరే కారణమని చెప్పారు. ఫొటో ఎగ్జిబిషన్ లో ఎన్టీఆర్ చరిత్రను మొత్తం పెట్టామన్నారు. ఎవరిదగ్గరైనా ఎన్టీఆర్ జ్ఞాపకాలకు సంబంధించి ఏమైనా ఉంటే ఎన్టీఆర్ ట్రస్టుకు అందించాలని విన్నవించారు. అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు దేవినేని ఉమా, పి నారాయణలతో పాటు ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News