: ఆసిస్ జట్టుకు స్పిన్ కోచ్ గా మాజీ భారత ఆటగాడు
ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముందస్తుగా ఉపఖండం పిచ్ లపై అవగాహన పెంచుకునేందుకు దుబాయ్ లో ప్రాక్టీస్ సెషన్ ఆరంభించింది. కఠిన శిక్షణ మాత్రమే సరిపోదని భావించిన ఆస్ట్రేలియా జట్టు భారత్ కు చెందిన మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరాంను సహాయ శిక్షకుడిగా నియమించుకుంది. గతంలో శ్రీలంక పర్యటన, భారత్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సందర్భంగా శ్రీధరన్ శ్రీరాం ఆసీస్ జట్టుకు స్పిన్ ఎదుర్కోవడంలో శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనను ఆసీస్ సహాయ కోచ్ గా మరోసారి నియమించింది. దీంతో ఈనెల 29న ఆయన దుబాయ్ లో ఆస్ట్రేలియా జట్టుతో కలవనున్నారు. ఆసీస్ కు మరోసారి పనిచేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు.