: మాయావతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బహిష్కృత నేత
బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతిపై ఆ పార్టీ బహిష్కృత నేత అమర్ పాల్ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ అడిగినందుకు రూ.8 కోట్లు ఇవ్వాలని తనను డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. మాయావతికి అత్యంత సన్నిహితుడు నసిముద్దీన్ సిద్ధిఖితో ఈ మేరకు తనకు ఒక సందేశం పంపినట్లు ఆరోపించారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి అమర్ పాల్ శర్మను నిన్న బహిష్కరించారు. బహిష్కరణకు గురైన మరుసటి రోజే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.