: శివపాల్ యాదవ్ పేరు లేకుండా జాబితా?


సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) రెండు వర్గాలుగా చీలడం.. ఒక వర్గానికి ములాయం సింగ్, మరో వర్గానికి అఖిలేష్ యాదవ్ నేతృత్వం వహిస్తుండటం... పార్టీ గుర్తు అయిన ‘సైకిల్’ ను అఖిలేష్ వర్గానికి ఈసీ కేటాయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ములాయంతో అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 38 మంది పేర్లతో ఉన్న ఒక జాబితాను అఖిలేష్ కు ములాయం అందజేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, ఆ జాబితాలో ములాయం తమ్ముడు, విధేయుడు అయిన శివపాల్ యాదవ్ పేరు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శివపాల్ కు బదులు ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్ పేరును ఆ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News