: ‘టాటా మోటార్స్’కూ చైర్మన్ గా నియమితులైన చంద్రశేఖరన్!
టాటా సన్స్ చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ ఎంపికైన విషయం తెలిసిందే. అదే గ్రూప్ కంపెనీ అయిన ‘టాటా మోటార్స్’ కూ తాజాగా ఆయన చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన చేసింది. టాటా మోటార్స్ కు అడిషినల్ డైరెక్టర్ గా, చైర్మన్ గా ఎంపిక చేశామని పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 21న ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. టాటా మోటార్స్ చైర్మన్ గా ఎంపికైన ఆయన రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్టు ‘నానో’పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.