: జంతు హక్కుల సంస్థపై మండిపడ్డ నటుడు సూర్య!
జంతు హక్కుల సంస్థ (పెటా) ఇండియాపై తమిళ నటుడు సూర్య మండిపడ్డారు. తమిళ సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ను వ్యతిరేకిస్తున్న పెటా తీరును ఆయన తప్పుబట్టారు. ఈ క్రీడ వల్ల ఎద్దులకు హాని జరుగుతుందని పెటా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అలా ప్రచారం చేయడం ద్వారా న్యాయస్థానంలో విజయం సాధించిన పెటా, ప్రజాకోర్టులో ఓటమి పాలైందని, తమిళ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రమాదంలో పడేసే ఏ చర్యను అయినా సరే, యువత ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అన్నారు.