: కేజ్రీవాల్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలి: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్


కేజ్రీవాల్ తన స్థాయి తెలుసుకుని విమర్శలు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. పటియాలాలో ఆయన మాట్లాడుతూ, కేజ్రీవాల్ కు దమ్ముంటే లంబీ స్థానం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ప్రకాశ్ సింగ్ బాదల్ కు సాయం చేసేందుకే అమరీందర్ లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై మండిపడ్డ అమరీందర్, బాదల్ కుటుంబ కబంద హస్తాల నుంచి బంధ విముక్తులను చేసేందుకే తాను లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. పదేళ్లుగా లంబీ కేంద్రంగా బాదల్ చేస్తున్న దురాగతాలకు చరమగీతం పాడుతానని ఆయన చెప్పారు. మేడమ్ సోనియా గాంధీ చెప్పినట్టు తమ పార్టీ పని చేస్తుందని, కేజ్రీవాల్ చెప్పినట్టు చేయదని ఆయన స్పష్టం చేశారు. అయినా కేజ్రీవాల్ తన స్ధాయి తెలుసుకుని విమర్శలు చేయాలని ఆయన సూచించారు. సిద్ధూతో ఎలాంటి డీల్స్ లేవని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి డీల్స్ చేసుకునే అలవాటు లేదని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News