: మోదీజీ... చరఖా ముందు కూర్చునే హక్కు మీకు లేదు: హార్దిక్ పటేల్


బహిష్కరణ శిక్ష ముగియడంతో నేడు గుజరాత్ లో అడుగుపెట్టిన పటీదార్ల నేత హార్దిక్ పటేల్ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రెండు లక్షల రూపాయల విలువ గల దుస్తులు ధరించిన ఆయన, గాంధీతో సమానం కాదని, చరఖా ముందు కూర్చునే హక్కు ఆయనకు లేదని పరోక్షంగా మోదీపై మండిపడ్డారు. గుజరాత్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని, తనపై పెట్టిన కేసులకు భయపడనని, పటేళ్లకు రిజర్వేషన్ల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని మరోమారు స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే పార్టీలతో కలిసి పనిచేస్తామని హార్దిక్ పటేల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News