: రజనీపై అనుచిత వ్యాఖ్యలు... శరత్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం


తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు, రాజకీయవేత్త శరత్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల రజనీ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. శరత్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర పాలనలో అనిశ్చితి నెలకొందని రజనీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను అక్కడే ఉన్న శరత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలతో రజనీ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాలాజాపేట, షోలింగర్, రాణిపేట, కాట్పాడి, అర్కోణం, ఆర్కాడు తదితర ప్రాంతాల్లో శరత్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.  

  • Loading...

More Telugu News