: ప్రవచనాల 'చాగంటి'పై యాదవుల ఫిర్యాదు
వివిధ టీవీ చానళ్లలో ప్రవచనాలు చెబుతూ పాప్యులర్ అయిన చాగంటి కోటేశ్వరరావుపై అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు హైదరాబాద్, టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన తన ప్రవచనాల్లో యాదవులను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కులాన్ని ఆయన అగౌరవ పరుస్తున్నారని ఆరోపించారు. యాదవ మహాసభ సభ్యులు అశోక్ కుమార్, సందేశ్ యాదవ్, మధుసూదన యాదవ్ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.