: రాజకీయాలపై కోనేరు హంపి స్పందన!
భారత మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజయవాడ బ్రాండ్ అంబాసడర్ గా ఎంపిక అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని మోదీ అంటే తనకు చాలా అభిమానమని తెలిపింది. ఆయన స్ఫూర్తితోనే తాను స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పింది. రెండేళ్ల నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపింది. ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి విజయవాడ బ్రాండ్ అంబాసడర్ గా కొనసాగుతానని హంపి చెప్పింది. తనకు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేసింది.