: రియల్ హీరో అనిపించుకున్న గాయకుడు అతీఫ్ అస్లాం.. ఈవ్ టీజర్ల నుంచి యువతిని రక్షించిన వైనం
తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ గాయకుడు అతీఫ్ అస్లాం రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్నాడు. ఈవ్ టీజర్ల నుంచి ఓ యువతిని రక్షించాడు. అంతేకాదు ఆమెను రక్షించిన అస్లాం అక్కడితో ఆమెను వదిలివేయకుండా యువతిని ఇంటి వద్ద వదిలేసి రావాలంటూ తన సెక్యూరిటీని ఆదేశించాడు. దీంతో ఆయనపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అస్లాం వేదిక కింద కొందరు ఆకతాయిలు ఓ అమ్మాయిని ఏడిపించడం అతని దృష్టిలో పడింది. వెంటనే పాటను మధ్యలోనే ఆపేసిన ఆయన ఈవ్ టీజర్ల దుమ్ము దులిపాడు. ఈ మొత్తం ఘటనను అదే కార్యక్రమంలో పాల్గొన్న మరో వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ అయింది.