: కాంగ్రెస్ లో చేరిక సొంతింటికి రావడమే: సిద్ధూ


తాను జన్మించిందే కాంగ్రెస్ కుటుంబంలోనని, తన తండ్రి 40 సంవత్సరాలు కాంగ్రెస్ లో పని చేశారని గుర్తు చేసిన మాజీ క్రికెటర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ లో చేరడం తాను సొంత ఇంటికి వచ్చినట్టేనని అభివర్ణించారు. నిన్న రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన, నేడు మాజీ మంత్రి అజయ్ మాకెన్ తో కలసి మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లో డ్రగ్స్ మాఫియా అధికంగా ఉందని, మనమంతా దాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం పెరిగిపోవడానికి అకాలీలే కారణమని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, మాదక ద్రవ్యాలను అరికడుతుందని హామీ ఇచ్చారు. కాగా, పంజాబ్ లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని, ఆ హామీతోనే ఆయన కాంగ్రెస్ లో చేరారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News