: రెండు రకాల స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గించిన లెనోవో
చైనా కేంద్రంగా పని చేస్తూ, ఇండియాలో స్మార్ట్ ఫోన్లు విక్రయిస్తున్న లెనోవో, రెండు వేరియంట్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జడ్ 2 ప్లస్ మోడల్ ధరలను రూ. 2,500 నుంచి రూ. 3 వేల వరకూ తగ్గిస్తున్నామని, ఈ ఆఫర్ రేటును అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో నేటి నుంచి పొందవచ్చని పేర్కొంది. జడ్ 2 ప్లస్ 32 జీబీ వేరియంట్ ధర రూ. 17,999 కాగా, రూ. 14,999కి, జడ్2 ప్లస్ 64 జీబీ వేరియంట్ ధర రూ. 19,999 కాగా, రూ. 17,499కి విక్రయించనున్నట్టు వెల్లడించింది. ఈ ఫోన్లు గత సంవత్సరం సెప్టెంబరులో భారత మార్కెట్లోకి విడుదలైన సంగతి తెలిసిందే.