: హార్వార్డ్ యూనివర్శిటీలో ప్రసంగించనున్న పవన్ కల్యాణ్
ప్రస్తుతం 'కాటమరాయుడు' చిత్రం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ అరురైన అవకాశం లభించింది. ఫిబ్రవరి 11 నుంచి రెండు రోజుల పాటు బోస్టన్ లోని హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే 'ఇండియా కాన్ఫరెన్స్ 2017'లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందింది. పవన్ కల్యాణ్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కు కూడా వర్శిటీ అధికారుల ఆహ్వానం అందింది. వీరిద్దరూ కలసి ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ వార్త తెలుసుకున్న పవన్ కల్యాణ్ అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక వర్శిటీ వేదికపై ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.