: నగదు ఉపసంహరణలపై ఆంక్షలకు ఈ వారంలో సడలింపు?


నగదు ఉపసంహరణలపై ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి మరోసారి ఉపశమనం కల్పించే నిర్ణయం ఆర్ బీఐ నుంచి ఈ వారంలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏటీఎంల నుంచి రోజుకి రూ.4,500, బ్యాంకు శాఖల నుంచి వారంలో రూ.24,000 నగదును తీసుకునే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. వీటిని ఈ వారంలోనే ఆర్ బీఐ సడలించనుందని అధికార వర్గాలు తెలిపాయి. సేవింగ్స్ ఖాతాల నుంచి రూ.24,000 ఉపసంహరణ పరిమితిని రూ.35వేల వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే, కరెంటు ఖాతాలకూా రూ.24,000 పరిమితే ఉండగా... దీన్ని రూ.50వేలకు పెంచనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఉపసంహరణలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసే విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. 

  • Loading...

More Telugu News