: కాపులతో కలిసుంటే బలిజలకు తీవ్ర అన్యాయమే!: ఓవీ రమణ విమర్శలు


కాపులతో కలసి ప్రయాణిస్తున్న బలిజ వర్గీయులు దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ నిప్పులు చెరిగారు. కాపులకు రిజర్వేషన్ కోసం జరుగుతున్న ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం మాత్రమే నాయకుడు కాదని ఆయన అన్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, కాపులతో కలసి నడిస్తే, బలిజ కులస్తులకు ఎన్నటికీ న్యాయం జరగదని, మంజునాధ కమిషన్ సైతం ఇదే విషయాన్ని గుర్తించిందని ఆయన తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కలిసి బలిజల సమస్యల గురించి వివరిస్తామని, రాజకీయంగా తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక ఉద్యమం సాగిస్తామని వెల్లడించారు. ప్రాణ త్యాగం చేసైనా బలిజల హక్కులను కాపాడుకుంటామని ఓవీ రమణ తెలిపారు.

  • Loading...

More Telugu News