: ప్రపంచంలోని సగం సంపద ఈ ఎనిమిది మంది వద్దే!: ఆక్స్ ఫామ్


ప్రపంచంలోని మొత్తం సంపదలో దాదాపు సగం సంపద కేవలం ఎనిమిది మంది వద్దే ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సు నేటి నుంచి దావోస్ లో జరుగుతున్న సందర్భంగా 'ఆక్స్ ఫామ్' సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. గత సంవత్సరంలో ధనికులకు, పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసం మరింతగా పెరిగిందని పేర్కొంది. చైనా, ఇండియాల నుంచి అందిన గణాంకాలను క్రోఢీకరించిన తరువాత, సగం మంది వద్ద ఉన్న ఆస్తుల విలువ కరిగినట్టు వెల్లడించింది.

2010లో సగం సంపద 43 మంది బిలియనీర్ల వద్ద ఉండగా, ఇప్పుడది ఎనిమిది మందికే పరిమితమైందని ఆక్స్ ఫాం పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఇండిటెక్స్ ఫౌండర్ అమానికో ఓర్టెగా, వెటరన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్, అమేజాన్ బాస్ జెఫ్ బెజోస్, ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్, ఒరాకిల్ కు చెందిన లారీ ఎల్లిసన్, మాజీ న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్ బర్గ్ వద్ద ఈ సంపద పేరుకుపోయిందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News