: ప్రజల కష్టాలు నీకేం తెలుసు?: రజనీకాంత్ పై విరుచుకుపడ్డ శరత్ కుమార్


రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటామని రజనీకాంత్ ను హెచ్చరించిన శరత్ కుమార్ ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. 'తుగ్లక్' పత్రిక వార్షికోత్సవం సభ వేదికగా పలువురు నేతలు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఒత్తిడి చేయగా, శరత్ కుమార్ స్పందించారు. "రజనీకి తమిళనాడు ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి తెలియవు. సూపర్ స్టార్ గా, నటుడిగా నాకు రజనీకాంత్ పై గౌరవం ఉంది. అయితే, రాజకీయాల్లోకి వస్తానంటే మాత్రం కుదరదు. ఎందరో మహా నేతలు తమిళనాడు గడ్డపై జన్మించారు. వారం రోజులు తమిళనాడులో, మరో వారం కర్ణాటకలో ఉండే రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదు" అని శరత్ కుమార్ నిప్పులు చెరిగారు. తమిళ సంప్రదాయాలపై ఆయనకు అవగాహన లేదని, ఈ విషయం ఎంతో మందికి తెలుసునని అన్నారు. కాగా, శరత్ కుమార్ వ్యాఖ్యలపై ఇప్పుడు తమిళనాట నిరసనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News