: జనావాసాలపై కూలిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం... 17 మంది మృతి
టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన రవాణా విమానం ఇళ్లపై కూలడంతో 17 మంది మరణించారు. ఈ ఘటన కిర్జిస్థాన్ లోని మనాస్ విమానాశ్రయం సమీపంలో జరిగింది. విమానం జనావాసాలపై కూలడంతో మంటలు చెలరేగి మృతుల సంఖ్య పెరిగిందని, ఒక పైలట్ సహా 16 మంది మృతదేహాలను వెలికితీశామని కిర్జీ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో అత్యధికులు స్థానిక ప్రజలేనని, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? ఎంతమంది ప్రయాణిస్తున్నారు? తదితర విషయాలు తెలియరాలేదు.