: రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై వివాదం... వస్తే అడ్డుకుంటానన్న నటుడు శరత్ కుమార్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తమిళనాడులో వివాదం రగిలింది. ఆయన పాలిటిక్స్ లోకి రావాలంటూ అభిమానులు ఒత్తిడి తెస్తున్న వేళ, రజనీ వస్తే అడ్డుకుని తీరతామని నటుడు శరత్ కుమార్ హెచ్చరించడం పెను దుమారాన్ని రేపుతోంది. శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలపై మండిపడుతున్న రజనీకాంత్ అభిమాన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగాయి. శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ, రోడ్లపై ధర్నాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, ఈ విషయంలో రజనీ మాత్రం ఇంకా స్పందించలేదు.