: హైదరాబాద్ వైపు వాహనాల బారులు... టోల్ గేట్ల వద్ద భారీ రద్దీ


సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ ను విడిచి స్వస్థలాలకు తరలివెళ్లిన స్థానికులు... తిరుగు ప్రయాణమవుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు పరిసమాప్తం కావడంతో తిరిగి ఉద్యోగ, వ్యాపారాల కోసం వారు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత నుంచి హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా పంతంగి, గొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఒక్కో వాహనం టోల్ గేట్ ను దాటి వెళ్లేందుకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు పడుతోంది. వాహనాల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద తిరిగి అదనపు కౌంటర్లను ప్రారంభించారు. పోలీసులు రంగంలోకి దిగి వాహనాలు త్వరగా వెళ్లేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News