: ఘోరంగా విఫలమైన యువరాజ్, ధోనీ.. నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా
పుణె వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది.
ఇంగ్లండ్ జట్టు టీమిండియా ముందు ఉంచిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు రాహుల్ 8, శిఖర్ ధావన్ 1 పరుగులకే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ కూడా వెంటవెంటనే వెనుదిరిగారు. సుదీర్ఘకాలం తరువాత వన్డే టీమ్ కి ఎన్నికైన యువరాజ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటవ్వగా, ధోనీ కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 40, జాధవ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 14 ఓవర్లకి 82/4 గా ఉంది.