: రాజ‌మౌళి న‌న్ను ఏమీ అన‌లేదు.. అవ‌న్నీ పుకార్లే: హాస్య‌న‌టుడు పృథ్వీ


స్టార్ హీరోలని అనుక‌రిస్తూ వారు తీసిన సినిమాల్లోని సీన్‌ల‌ను హాస్యాస్ప‌దంగా చూపిస్తూ తాను చేస్తోన్న న‌ట‌న‌ను ప్రేక్ష‌కులు ఎంత‌గానో మెచ్చుకుంటున్నార‌ని హాస్య‌న‌టుడు పృథ్వీ అన్నాడు. ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... తాను హీరోల‌ను అనుక‌రిస్తూ సినిమాలు చేస్తున్నందుకు ఆయా హీరోల‌కు కోపం ఏమీ రాద‌ని అన్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌ని అనుక‌రిస్తూ తాను క్యారెక్ట‌ర్‌లు చేశాన‌ని, బాల‌కృష్ణ‌తో క‌లిసి కూడా ఓ సినిమాలోనూ న‌టించాన‌ని అన్నారు. క‌థ‌లో భాగంగా తాను హాస్యం చేస్తాన‌ని, తాను అనుక‌రిస్తోన్న హీరోల‌ ఇమేజ్ పెరిగేలా ఉంటుందే కానీ, వారి ఫ్యాన్స్ నొచ్చుకునేలా మాత్రం ఉండ‌ద‌ని అన్నారు. ఓ సినిమాలో ప్ర‌భాస్ బాహుబ‌లి పాత్ర‌ను అనుకరిస్తూ చేసినందుకు త‌న‌కు ఆ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చివాట్లు పెట్టార‌ని వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అస‌త్యాలేన‌ని, మ‌సాలా చ‌ల్లి కొందరు అలా రాశార‌ని చెప్పాడు.

  • Loading...

More Telugu News