: బాలకృష్ణ తప్పేం లేదు... నా అత్యుత్సాహమే... : బాలయ్య కొట్టాడని ప్రచారం జరుగుతున్న అభిమాని వివరణ


'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం విడుదల సందర్భంగా కూకట్ పల్లి భ్రమరాంబ థియేటరులో ఓ అభిమానిని బాలకృష్ణ కొట్టారని, అతని సెల్ ఫోన్ ను విసిరేశారని జరుగుతున్న ప్రచారంపై ఆ అభిమాని స్పందించాడు. జరిగిన ఘటనలో బాలయ్య తప్పేమీ లేదని వివరణ ఇస్తూ, ఓ వీడియోను పోస్టు చేశాడు. ఆ రోజు థియేటరు వద్దకు బాలకృష్ణ వస్తున్నారని తెలుసుకుని ఓ వీరాభిమానిగా అక్కడికి వెళ్లానని చెప్పాడు. బాలయ్య తనకు దగ్గరగా రావడంతో ఫోటో తీసుకునేందుకు ఉత్సాహ పడ్డానని అన్నాడు. ఈ క్రమంలో ఆయన కాలును పొరపాటున తాను తొక్కానని, ఆ బాధలో బాలయ్య తనను నెట్టడంతోనే తన చేతిలోని ఫోన్ కిందపడి పగిలిందని తెలిపాడు.

ఈ ఘటనను వెబ్ మీడియా, సోషల్ మీడియా, ఘటనను యాంటీగా చూపించాయని ఆరోపించాడు. అక్కడ జరిగింది ఒకటైతే, మరో కథను ప్రచారం చేశారని అన్నాడు. సినిమా హిట్ అయిందని, కలెక్షన్లను ఆపలేక ఇలాంటి ప్రచారం సాగిస్తున్నారని విమర్శించాడు. బాలయ్య బాబంటే తనకెంతో అభిమానమని, అదే రోజు మరో థియేటరు వద్ద బాలయ్యతో కలసి తాను సినిమా చూశానని, అప్పుడు ఫోటో కూడా దిగానని చెప్పాడు. తమ హీరో ఎంతటి మంచి వ్యక్తో తనకు తెలుసునని, ఆయనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మక్కర్లేదని అన్నాడు.

  • Loading...

More Telugu News