: జైలులో పార్టీ చేసుకొని ఫుల్లుగా ఎంజాయ్ చేసిన మహిళా ఖైదీలు!
ఉత్తర బ్రెజిల్ లోని క్యూరాడో జైలులో మహిళా ఖైదీలు ఫుల్ ఎంజాయ్ చేశారు. కొకైన్వాడి మరీ పొట్టి డ్రెస్లు వేసుకొని డ్యాన్సులు చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఆ జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బ్లాగర్ కార్లోస్ డిసిల్వా తన సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసి బ్రెజిల్ సిగ్గుపడాలని కార్లోస్ పేర్కొన్నారు. నేరాలు చేసిన ఖైదీలు ఇలా ఎంజాయ్ చేస్తుండడం దారుణమని అన్నారు.
వారు ఎంచక్కా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారని, జైలులో మద్యం తాగుతున్నారని కార్లోస్ మండిపడ్డారు. వారికి ఇటువంటి సౌకర్యాలను కల్పించడం ఏంటని, ఈ అంశం కష్టపడి పని చేస్తూ ఇంటిని, పిల్లలను చూసుకుంటున్న మహిళలను అవమానించినట్టేనని పేర్కొన్నారు. ఈ వీడియోను అతడికి అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న మరో మహిళా ఖైదీ అందించిందని, ఆమె పేరు చెబితే ఆమె ప్రాణాలకు హాని కలుగుతుందని, అందుకే తాను ఆమె పేరు చెప్పడం లేదని అన్నారు.