: కృత్రిమ శ్వాసనాళంతో రెండేళ్ల పాపకు మరోజన్మ


తల్లిదండ్రుల కోటి ఆశలను తీరుస్తూ ఆ చిన్నారి భూమిపైకి వచ్చింది. కానీ, శ్వాస తీసుకోవడానికి శ్వాసనాళం లేదు. దాంతో గాలి తీసుకోలేని పరిస్థితి ఆ చిన్నారిది. కానీ, మూడేళ్ల తర్వాత వైద్యులు కృత్రిమ శ్వాసనాళంతో దక్షిణ కొరియాకు చెందిన మూడేళ్ల హన్నాకు మళ్లీ పునర్జన్మ ఇచ్చారు.

చంటిపాప బొడ్డు తాడు నుంచి మూలకణాలను సేకరించి దాని ద్వారా వారం రోజుల్లోనే కృత్రిమ శ్వాసనాళం తయారు చేశారు. దానిని గత నెల హన్నాకు అమర్చారు సియోల్ లోని ఇల్లినాయిస్ హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి బాగుందని, కృత్రిమ శ్వాసనాళం ద్వారా శ్వాస తీసుకుంటోందని, అయినా వెంటిలేటర్ ను కొనసాగిస్తున్నామని వైద్యులు ఈ రోజు ప్రకటించారు. హన్నా భవిష్యత్తులో నిశ్చింతగా జీవించగలుగుతుందని చెప్పారు. ఇలాంటి చికిత్సల వల్లే నేడు మూలకణాల నిల్వ బ్యాంకులకు ఆదరణ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News