: ఖైదీ, శాతకర్ణి సినిమాలపై మహేష్ బాబు స్పందన
సంక్రాంతి సందర్భంగా విడుదలైన రెండు భారీ సినిమాలపై ప్రిన్స్ మహేష్ బాబు స్పందించాడు. శాతకర్ణి, ఖైదీ సినిమాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. "ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మిస్ అయ్యాం సార్. వెల్ కమ్ బ్యాక్. ఖైదీ సినిమా టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు" అంటూ చిరంజీవిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అలాగే... గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి అద్భుత సినిమా చేసిన బాలకృష్ణకు హ్యాట్స్ ఆఫ్ అంటూ మరో ట్వీట్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలోనే ఇదొక అద్భుతమైన పర్ఫామెన్స్ గా మిగిలిపోతుందని అన్నాడు.