: నాన్న తర్వాత సినిమానే కాదు... నా సినిమాను కూడా మా బ్యానర్ పైనే నిర్మిస్తా!: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన తొలి సినిమానే ఘన విజయం సాధించింది. తన తండ్రి చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150'వ సినిమాతో నిర్మాతగా రామ్ చరణ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇకపై కూడా హీరోగా సినిమాలు చేస్తూనే, నిర్మాతగా కూడా కొనసాగుతానని చరణ్ తెలిపాడు. తమ బ్యానర్ లోనే నాన్న తర్వాతి సినిమాను కూడా తానే నిర్మించబోతున్నానని... తన సినిమాను కూడా నిర్మించనున్నామని చెప్పాడు. మంచి కథల కోసం వెతుకుతున్నామని తెలిపాడు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాలను వెల్లడించాడు. నిర్మాతగా తాను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదని... కానీ, చెక్కులపై సంతకాలు చేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. కొన్ని వందల సంతకాలు చేయాల్సి వచ్చిందని చెప్పాడు.