: బాలకృష్ణ, క్రిష్‌లతో కలిసి సినిమా చూసిన వెంకయ్యనాయుడు


సినీన‌టుడు బాల‌కృష్ణ నటించిన ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. యుద్ధవీరుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవితక‌థ ఆధారంగా కేవ‌లం 79 రోజుల్లో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను వీక్షించ‌డానికి రాజ‌కీయ‌, సినీరంగ‌ ప్ర‌ముఖులు కూడా ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ రోజు బాల‌కృష్ణ‌. ద‌ర్శ‌కుడు క్రిష్‌ల‌తో క‌లిసి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ సినిమాను వీక్షించారు. హైదరాబాద్‌ ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో వారంతా క‌లిసి ఈ సినిమాను చూశారు.

  • Loading...

More Telugu News