: ప్రియాంక చోప్రా తలకు గాయం... ఆస్పత్రికి తరలింపు


బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గాయపడింది. 'క్వాంటికో' సెకండ్ సీజన్ కు సంబంధించిన ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా ఆమె కిందపడిపోయింది. దీంతో, ఆమె తలకు గాయమైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని చెప్పిన డాక్టర్లు... కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 'క్వాంటికో' సిరీస్ తో ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం సెకండ్ సీజన్ సెట్స్ మీద ఉంది. 

  • Loading...

More Telugu News